Thursday, March 26, 2009

Prajavanam


ప్రజాస్వామ్యం లో నాయకులూ, పార్టీలు అనేవి నీడ, ఫలాలు ఇచ్చే చెట్లు ఐతే, అ చెట్టులకు వేసే విత్తనాలే 'ఓట్లు'. ఇన్నాళ్లూ ప్రజాస్వామ్యం లో భాగంగా మన రాష్ట్ర వనం లో ఎన్నో విత్తనాలు వేసాం, ఎన్నో చెట్లు పెంచాం. వాటిలో మనకి నీడ, ఫలాలు ఇచ్చినవి కొన్ని, ముళ్ళతో గుచ్చినవి కొన్ని. ఎన్నికల తర్వాత ఎన్నికలు వచినప్పుడల్లా ఆ చెట్లకి క్రమం తప్పకుండా నీళ్ళు పోస్తూ పెంచుకుంటున్నాం. కానీ, ఇప్పుడు చుస్తే మన రాష్ట్ర వనం లో నీడ, ఫలాలు ఇచ్చే చెట్లకన్నా ముళ్ళులతో పొడిచే చెట్లే ఎక్కువ అయిపోయాయి. మొత్తం వనం అంతా ముళ్ళచెట్లతో నిండక ముందే, మంచి విత్తనాలు వేసుకోవాలి, 'ప్రజావనం'ని 'నందనవనం'గా మార్చుకోవాలి.

- ఎన్నికలు అంటే ఎవరినో నాయకులవలే కూర్చోబెడటం కాదు, అవి మన జీవితం లో ప్రతి అణువు ప్రభావం చూపేవి అని గ్రహిద్దాం.

- ఎన్నికలలో 'ఓటు' తప్పకుండా వెయ్యాలని తీర్మానించుకుందాం.

- పై పై హంగులకు మోసపోకుండా, మనలో మనమే స్వచ్చంగా ఆలోచించుకుని సరైన అభ్యర్దికి/పార్టీకి మన 'ఓటు' వేద్దాం.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలపైన నా అభిప్రాయం -

స్వాతంత్రం కోసం తపించిన 'కాంగ్రెస్' అంటే ఎంతో ప్రీతి,
దేశ స్వేచ్చ కోసం పోరాడిన 'నాటి నాయకులకు' నిలిచెను ఎనలేని ఖ్యాతి!
కాని, నేటి కాంగ్రెస్ నాయకుల బాటే వేరు,
ధనార్జనే ధ్యేయంగా సాగే అక్రమాలే వారి తీరు!

తెలుగువాడి గుండెనించి పుట్టిన 'తెలుగుదేశం' అంటే ఎంతో అభిమానం,
బీదవారి బాగోగులే ధ్యేయంగా అడుగులు వేసిన 'అన్న'గారు నిలుస్తారు చరిత్ర లో కలకాలం!
కాని, అన్నగారి ఆశయాలు 'అన్నీ' కదిలేనా ఈ దినం?
బీదవాడి బ్రతుకు తెరువు ఇంకా 'బాధే'గా అనుదినం!

'అన్న' తరువాత 'అన్నయ్య' అయిన 'చిరంజీవి' అంటే ఎంతో ప్రియం,
'రక్త'దాత గా 'కాంతి'దూత గా పంచారు ఆయన ఆదర్శం!
కాని, నిస్వార్ధ, నిజాయితీ గల నాయకులకే పార్టీలో చోటు నిలిచేనా ఈనాడు?
ఇతర పార్టీల 'వలస' నాయకులతో 'మార్పు' అసాధ్యం 'ఏనాడూ'!

ప్రత్యేక తెలంగాణా 'ఆత్మగౌరవం' కోసమని నినదించెను 'తెరాస',
'ప్రత్యేక అధికార' స్వార్దపూరిత ఆశే వారిని నడిపెనా 'హమేషా'?
తెలుగు 'ఆత్మ'ను వేరు చేస్తే 'గౌరవం' నిలవదురా,
'అభివృద్ధి' అనే మార్పుతోనే 'ఆత్మగౌరవం' కలిగెనురా!!

దశాబ్దాల వంచనకు పలుకుదాము సమాధి,
'లోక్ సత్తా' నాయకత్వంతోనే 'మార్పు'కు పునాధి!

'ఓటు' విలువ తెలియచెప్పే 'బాట'లో నడిచారు,
'ప్రజాస్వామ్యం' మనుగడ కొరకు స్వచ్చమైన పోరాటాలతో కదిలారు!

'రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్' ద్వారా 'ప్రజలే ప్రభువులు' అని చూపారు,
'పోస్టాఫీసులలో ఓటరు రిజిస్ట్రేషన్' ద్వారా పౌరులను పోలింగుకు చేరువ చేసారు!

'లోక్ సత్తా' వారి భావాలూ ఉట్టి 'పలుకులు' కాదు 'ప్రణాళికలు',
చీకటి నిండిన లోకంలో అవి వెలిగే 'ఆశాదీపాలు'!

'ఓటు' విలువ తెలుసుకుని కదలిరా సోదరా,
విరజిమ్మే 'బంగారు భవిత' కచ్చితంగా నీదిరా!!

3 comments:

Sarat said...

Very good one Prakash..

Let me say you in this occasion,Loksatta is the only political party which i believe in. Im great admirer of JP sir.I strongly feel he should win this time in Kukatpally constituency.

Jai Loksatta!!

G V Prakash said...

Thanks, Sarat! I too hope that JP wins from Kukatpally!

Pradeep said...

JP won!!