Wednesday, March 04, 2009

వెళ్ళిపోకు నేస్తం

Life is bliss! It is precious! I wish there would be no reason in the world that makes a person take his or her own life. The presented verse depicts an optimistic view of life and tries to rejuvenate positive spirit.

వెళ్ళిపోకు వెళ్ళిపోకు నేస్తమా,
ఈ లోకం విడిచి పారిపోకు మిత్రమా!

నీ నిస్పృహకు నీ ఆత్మని చంపే హక్కు ఎక్కడిది నేస్తమా,
నిస్పృహను అంతం చేసి ముందుకు సాగురా మిత్రమా!

ప్రేమ విఫలమైతే, గుండెనే సమిధ చేస్తావా నేస్తమా,

నిజమైన ప్రేమే ప్రేరణగా, నలుగురికీ ఆ 'ప్రేమ'ను పంచు మిత్రమా!

అప్పులు తాళలేక జీవితాన్ని మధ్యలోనే అంతం చేసినేల నేస్తమా,
మిగిలిన జీవిత భాగం ఆ భగవంతుడికి 'అప్పు' తీర్చేది ఎప్పుడు మిత్రమా?

మన చుట్టూ అలముకున్న నిరాశ, నిస్పృహలంత చిన్నది కాదు ఈ లోకం నేస్తమా,
ఓ సారి నూతన ఆలోచనల తలుపు తెరిసి చూడు, ప్రపంచంలోని అనంత పరిమళమైన ఆశ, శక్తి నీ సొంతం మిత్రమా!

చరిత్రలో మహనీయులకి ఏనాడూ విజయం విధిగా రాలేదు నేస్తమా,
సడలని ధైర్యమే బాటగా, కరగని కృతనిశ్చయమే బాసటగా, విధికే 'విధి'ని మార్చి 'రాత'ను రాసుకున్నారు మిత్రమా!

మానవ జన్మ భగవంతుడు ప్రసాదించిన 'వరం' నేస్తమా,
ఆ జన్మ చిరకాలం చరిత లో నిలిచేలా, ముందుకు అడుగులు వేసి సాగు మిత్రమా!

వెళ్ళిపోకు వెళ్ళిపోకు నేస్తమా,
లోకం విడిచి పారిపోకు మిత్రమా!

No comments: