Saturday, February 28, 2009

జీవితం

ఏది జీవితం, ఏది దాని పరమార్ధం!

సుఖ దుఖాల డోలాయమానము నడుమ,
ఆశ నిరాశల దాగుడు మూతల వలయమున,
గెలుపు ఓటముల భిన్న భావముల చదరంగమున,
ఏది జీవితం, ఏది దాని పరమార్ధం!

బ్రతుకు 'నావ'లో ఆరంభమైన ప్రయాణం,
మద్యలో లేదుగా విరామం,
చల్లని మనసుల గాలులు సోకగ,
నిలిచెనా ఈ మధుర ప్రస్థానం,
కఠిన అలలు, విధి వడగాలులు తడిమినా,
ఆగెనా ఈ ప్రయాణం,
వెచ్చని బంధాల కాంతులు తోడుగ,
కదిలెనుగా ముందుకు పయనం!

నాలుగు దిశలూ (నలుగురికి) కాంతులు పంచినా జీవనం,
తీరం కనపడని సాగర దూరంలా కలిగినా కాలం,
కరగక ఆగదుగా విరజిమ్మిన కాలం,
గమ్యం చేరక మానదుగా ప్రతి జీవిన ప్రస్థానం!

ఏది జీవితం, ఏది దాని పరమార్ధం!

1 comment:

Anonymous said...

I am your sincere admirer. Please keep posting your blogs regularly. Waiting to see your next post.... Thanks..... Hey also I am first one to comment on your blog..... :)