Sunday, March 07, 2010

Dashabdhala Swantantryam

దశాబ్దాల స్వాతంత్ర్యం దశవిధాలా కుంటుపడితే,   
నిస్వార్ధమైన రాజకీయం నలుదిశలూ మాయమౌతే,
రగులుతుంది రగులుతుంది చితిమంటల్లో భారతావని,
కన్నీరై పారుతుంది గత వీరుల చరితావని!

కుల మతాల కౌగిట్లో కనుచూపులు మందగిస్తే,
ప్రాంతాల నడుమ ధ్వేషాగ్నితో విచక్షనే వికటిస్తే,
కదం తొక్కి కదులుతుంది పైశాచిక అరాచకత్వం,
విషాదమై విలపిస్తుంది విశాలాంధ్ర జనవికాసం!

విషమెక్కిన రాజకీయవలయానికి బానిసై బ్రతుకు సాగిస్తే,
బ్రతుకు తెరువు బాటలో తప్పదుగా మనకు పరాజయం!
అమరజీవుల ప్రేరణతో సాగాలి మన ప్రస్థానం,
ధ్వేషభావాల కారుమబ్బుల నుంచి కాంతి వైపు ప్రయాణం!

No comments: